హైదరాబాద్, 1 ఆగస్టు (హి.స.)
ఫాస్టాగ్ కొత్త నిబంధనలు ఆగస్టు 1వ
తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. టోల్ గేట్ల వద్ద జాప్యం లేకుండా ఆన్ లైన్లో త్వరితగతిన రుసుములు చెల్లించేందుకు ఫాస్టాగ్ను వాహనదారులు ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక నుంచి ఫాస్ట్ ట్యాగ్ లు లేని వాహనాల నుండి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. అందువల్ల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ అనేది తప్పనిసరి.
ఫాస్ట్ ట్యాగ్పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) తాజా ఉత్తర్వులతో ఆగస్ట్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. మూడు నుంచి ఐదు సంవత్సరాల క్రితం జారీచేసిన అన్ని ఫాస్ట్ ట్యాగ్ కేవైసీని అక్టోబర్ 30 లోగా పూర్తి చేయాలని NPCI కోరింది. ఐదు సంవత్సరాల క్రితం జారీ చేసిన ఫాస్ట్ ట్యాగ్లను తప్పనిసరిగా మార్చుకోవలసి ఉంటుందని తెలిపింది. ప్రతీ వాహనదారుడు తమ ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన తేదీని చెక్ చేసుకొని, కేవైసీని పూర్తి చేయడంతో పాటు ఐదు సంవత్సరాలు పూర్తయిన వాటి స్థానంలో కొత్తగా అప్డేట్ చేసుకోవాలని NPCI పేర్కొన్నది. దీనికి చివరి తేదీ ఈ సంవత్సరం అక్టోబర్ 31 గా నిర్ణయించారు. సంబంధిత వాహన ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా తమ వ్యక్తిగత మొబైల్ నంబరుకు లింక్ చేయాలని, కేవైసీ చివరి తేదీ వరకు వేచిచూడకుండా వీలైనంత తొందరగా వాహనదారులను అప్డేట్ చేసుకోవలసిందిగా ఎన్పీసీఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
హిందూస్తాన్ సమచార్
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్ / నాగరాజ్ రావు