
అమరావతి, 20 జనవరి (హి.స.)
:ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీఐ నూతన కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో వారిచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాస రావు ప్రమాణం చేశారు. అనంతరం.. పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తి వట్టికూటిలు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్టీఐ ఉన్నతాధికారులు, నూతన కమిషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ