నిజామాబాద్, 1 ఆగస్టు (హి.స.)
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల
నిర్వహణ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.మోస్రా మండలంలోని గోవూర్ గ్రామంలో గల నర్సరీని కలెక్టర్ గురువారం పరిశీలించారు. స్థానికంగా గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, మోస్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా కలెక్టర్
సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జడ్పీ హై స్కూల్ లో చేపట్టిన పనులను పరిశీలించి, ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ గురించి
వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సామర్ధ్యానికి అనుగుణంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో నాణ్యమైన బోధన చేయాలని
ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు సులభంగా ఆకళింపు చేసుకునే విధంగా, వారికి అర్ధమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ 7, 8, 9 తరగతి గదుల్లోకి వెళ్లి, విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి వారి
సామర్ధ్యాన్ని తెలుసుకున్నారు.
హిందూస్తాన్ సమచార్
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్ / నాగరాజ్ రావు