అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)
అమరావతి, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా భారీ నష్టం వాటిల్లింది. వరద ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో జరిగిన నష్టం వెలుగు చూస్తోంది. ఏపీలో వరద నష్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారమే రూ. 6,882 కోట్ల మేర నష్టం వాటిళ్లినట్లు కేంద్రానికి ఏపీ నివేదిక అందజేసింది. వ్యవసాయం, ఉద్యాన పంటలు సహా రోడ్లు, ఇతర ఆస్తి నష్టాలపై పూర్తిస్థాయి నివేదిక కోసం ఎన్యూమరేషన్ కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల