అమరావతి, 10 సెప్టెంబర్ (హి.స.)
పటమట: విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డాయి. మాచవరం ప్రాంతంలోని జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. డేరంగుల వెంకటస్వామి వీధిలో జి.గోపికుమార్ అనే వ్యక్తి తన ఇంటి పక్కన కొండను ఆనుకుని ఉన్న చెట్టును నరికేందుకు నలుగురు కూలీలను మాట్లాడుకున్నారు. మంగళవారం ఉదయం చెట్టుకొమ్మలు నరుకుతున్న క్రమంలో బాగా తడిచిన కొండచరియలు విరిగి కూలీలపై పడ్డాయి. ఈ ప్రమాదంలో విజ్జాడ రాము (55) మృతిచెందగా.. కామయ్య, హుస్సేన్ గాయపడ్డాయి. మాచవరం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల