సిఎం చంద్రబాబు నేడు ఏలూరు జిల్లాలో పర్యటన
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరు )లో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజ్ హెలిపాడ్‌కు చేరుకుని ఆర్‌టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద తమ్మిలేరు ()ను పరిశీలిస్తారు. అనంతరం సీఆర్‌రెడ్డి క
సిఎం చంద్రబాబు నేడు ఏలూరు జిల్లాలో పర్యటన


అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఏలూరు )లో పర్యటించనున్నారు. ఉదయం 11గంటలకు ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజ్ హెలిపాడ్‌కు చేరుకుని ఆర్‌టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద తమ్మిలేరు ()ను పరిశీలిస్తారు. అనంతరం సీఆర్‌రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు కాకినాడ జిల్లా బయలుదేరి వెళతారు. కాగా తొలుత చంద్రబాబు ఆకివీడులో పర్యటించనున్నారని షెడ్యూలు ఖరారు చేశారు. చివరినిమిషంలో ఆకివీడు పర్యటన రద్దు చేసుకుని ఏలూరులో పర్యటనకు మార్పు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande