ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటన
ఏలూరు, 11 సెప్టెంబర్ (హి.స.): ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహ
chndrababu


ఏలూరు, 11 సెప్టెంబర్ (హి.స.): ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎకరాకు రూ.10 వేలు పరిహారం చెల్లించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

గతంలో బుడమేరుకు గండ్లు పడితే వైకాపా ప్రభుత్వం పూడ్చలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘‘వైకాపా పాలనలో బుడమేరును ఆక్రమణలకు గురి చేశారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి.. అక్రమ కట్టడాలకు అనుమతులిచ్చారు. తప్పుడు బిల్లులతో డబ్బును కాజేశారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలే ఎక్కువ నష్టపోతారు. మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు వద్ద 5 రోజులు ఉండి గండ్లు పూడ్చారు కాబట్టే విజయవాడకు వరద తగ్గింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande