అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.): తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు పార్టీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో పాల్గొన్న వైసీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా పాలడుగు దుర్గాప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ రోజు దుర్గాప్రసాద్ గుంటుపల్లిలోని తన నివాసంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం కార్యాలయం, చంద్రబాబు నివాసం పై దాడితోపాటు, మాజీ మంత్రి దేవినేని ఉమాపై కూడా పాలడుగు దుర్గా ప్రసాద్ దాడికి పాల్పడ్డాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల