అమరావతి, 31 ఆగస్టు (హి.స.):సెప్టెంబరు 14, 15 తేదీల్లో తిరుపతిలో మహిళా పార్లమెంటేరియన్ల సమావేశం నిర్వహిస్తున్నట్టు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి 300 మంది మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరవుతారన్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్నదని తెలిపారు.
సెప్టెంబరు 14న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, 15న ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని వివరించారు. 18 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని అయ్యన్న చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ