ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం సంగారెడ్డి జిల్లా కలెక్టర్
తెలంగాణ, సంగారెడ్డి. 1 సెప్టెంబర్ (హి.స.) ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యంగా అధికారులు పని చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానిక
సంగారెడ్డి కలెక్టర్


తెలంగాణ, సంగారెడ్డి. 1 సెప్టెంబర్ (హి.స.)

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ

కర్తవ్యంగా అధికారులు పని చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు, పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ పద్మజరాణిలకు తమ సమస్యలు విన్నవిస్తూ ఫిర్యాదులను సమర్పించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికివచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాగా రెవిన్యూ శాఖకు సంబంధించి -16, పౌరసరఫరాల శాఖలో 03, డిఆర్డిఓ 04, వివిధ శాఖలకు సంబంధించి 21, మొత్తంగా 44 ఫిర్యాదులు అందాయి. ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారి వెంటనే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande