తిరుమల, 2 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 8 గంటలు
ఓ వైపు వినాయకచవితి నవరాత్రి ఉత్సవాలు, మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా తిరుమలకు (Tirumala Samacharam) వచ్చే భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) తెలిపింది.
సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 2-4 గంటల సమయం పడుతుందని, రూ.300 శ్రీఘ్రదర్శనంకు 1-3 గంటల సమయం పడుతుందని పేర్కొంది.
-సోమవారం (సెప్టెంబర్ 1) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ని 65,384 మంది భక్తులు దర్శించుకోగా.. 22,512 మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి