
తెలంగాణ, సూర్యాపేట. 2 సెప్టెంబర్ (హి.స.)
కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. రూ.54.03 కోట్లతో రాజీవ్ నగర్ రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, రూ.5.10 కోట్లతో నీటి పారుదల శాఖ సర్కిల్ ఆఫీస్ డివిజన్ 4 సమీకృత కార్యాలయం నూతన భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందాల్ పవార్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంలో 2.29 లక్షల ఎకరాలకు సాగునీరును పర్యవేక్షించే అధికారులకు కార్యాలయం నాలుగు అంతస్తులతో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుందన్నారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు