హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.)అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో పాటు ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ తొందర్లోనే ప్రారంభం కానున్నట్లు సంస్థ యాజమాన్యాలు వెల్లడించాయి.
ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు టీవీలు.. ఫర్నిచర్ లలో భారీగా డిస్కౌంట్లు ఇప్పిస్తున్నారు. అమెజాన్ తన ఫెస్టివల్ సేల్ ను త్వరలో ప్రారంభించ నుంది. సేల్స్ లో యాపిల్, శాంసంగ్ వంటి తదితర స్మార్ట్ ఫోన్లు 40శాతం వరకు డిస్కౌంట్ తో లభించనున్నాయి. మిగిలిన కంపెనీలు కూడా 65 శాతం అంటే కొన్ని వస్తువులపై మాత్రమే డిస్కౌంట్లు ఇస్తున్నాయి.
ఎస్ బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10శాతం వెంటనే రాయితీ ఇవ్వనున్నాయి. అమెజాన్ పే లెటర్ కస్టమర్లకు రూ.600 రివార్డ్స్ అందించనుంది.
ఫ్లిప్ కార్ట్ యాక్సిక్, ఐసీఐసీఐ బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్ లపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నాయి. రెండు దిగ్గజ సంస్థలు భారీ ఆఫర్లతో వినియోగదారుల ముందుకు రానున్నాయి. ఈ పండగ సీజన్ లో అమెజాన్, ఫ్లిప్ కార్డ్ ల మధ్య గట్టి పోటీ ఏర్పడనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు