అమరావతి, 2 సెప్టెంబర్ (హి.స.)
రాజంపేట గ్రామీణ, రాజంపేట రైల్వే స్టేషన్ అమృత పథకంలో భాగంగా కొత్త హంగులద్దుకుంటోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ.28.51 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరుగుదొడ్లు, ప్లాట్‌ఫారం, ప్రయాణికులు వేచి ఉండేందుకు వీలుగా గదులు నిర్మిస్తున్నారు. ఎల్‌ఈడీ లైటింగ్, ఉద్యాన వనం, సీసీ టీవీలు, ఈపీ బ్రేక్ సిస్టమ్, దివ్యాంగుల ప్రయాణానికి వీలుగా కంపార్ట్‌మెంట్, లిప్టులు ఏర్పాటు చేస్తున్నారు. విశాలమైన ప్లాట్‌ఫాంలు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ప్రముఖ ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, గనులు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలు.. రాజంపేట స్టేషన్ నుంచి అవి ఎంత దూరంలో ఉన్నవీ తెలుపుతూ చిత్రాలు ఏర్పాటు చేశారు. అన్నమయ్య జీవిత విశేషాలకు సంబంధించిన చిత్రాలను తీర్చిదిద్దారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ