సుదర్శన్ రెడ్డిని అర్బన్ నక్సలైట్ అనడం తగదు.. అమిత్ షా వ్యాఖ్యలపై కోదండరామ్ ఫైర్
హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.) ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించాలని ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా విద్యావంతులు, మేధావులు, జర్న
కోదండరాం


హైదరాబాద్, 2 సెప్టెంబర్ (హి.స.) ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించాలని ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా విద్యావంతులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రముఖ సామాజిక కార్యకర్తల నుంచి సేకరించిన సంతకాల పత్రాన్ని ప్రముఖ జర్నలిస్టులు రామచంద్రమూర్తి, మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ కోదండరామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజేఎస్ చీఫ్, ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక ఎన్నిక మాత్రమే కాదు.. భారతదేశ భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య సంస్థల నిలకడపై జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. దేశంలో పౌరుల హక్కులు బలహీనమవుతున్న ఈ సమయంలో, ఈ ఎన్నిక దేశ ముఖచిత్రానికి దిక్సూచిగా నిలవాలని అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడే శక్తులు ఒకవైపు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఒకవైపు ఉన్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande