ప్రజల భద్రతలో డాగ్​ స్క్వాడ్ కీలకం.. హోం మంత్రి అనిత
మంగళగిరి, 2 సెప్టెంబర్ (హి.స.)ప్రజల భద్రతలో డాగ్‌ స్క్వాడ్‌ కీలక పాత్ర పోషిస్తుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంగళగిరి 6 బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్ ఇవాళ ఉదయం నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత, డీజీ
అనిత


మంగళగిరి, 2 సెప్టెంబర్ (హి.స.)ప్రజల భద్రతలో డాగ్‌ స్క్వాడ్‌ కీలక పాత్ర పోషిస్తుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంగళగిరి 6 బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పెరేడ్ ఇవాళ ఉదయం నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత, డీజీపీ హరీశ్​ కుమార్ గుప్తా పాల్గొన్నారు. పోలీసుల నుంచి హోం మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలాలు ప్రదర్శన, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సంద ర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ టెక్నాలజీ చేయలేని పనులు స్నిఫర్‌ డాగ్స్‌ చేస్తాయన్నారు. శిక్షణ తర్వాత 35 జాగిలాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. డీజీపీ హరీశ్​కుమార్​గుప్తా మాట్లాడుతూ ఏపీ పోలీస్ చరిత్రలో డ్రగ్స్ ను కూడా గుర్తించేలా జాగిలాలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ పూర్తిగా నిరోధించేలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. నిరంతరం పోలీస్​నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల సంఖ్య తగ్గించామని డీజీపీ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande