ఢీల్లీ, 2 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షల తెలిపారు. పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. పవర్ స్టార్ గా ఆయన లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయేను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి