పెదవాల్తేరు, 1 సెప్టెంబర్ (హి.స.)
, నగరానికి చెందిన వైద్య విద్యార్థిని సృజనాదేవి మిస్ వైజాగ్‌గా ఎంపికయ్యారు. ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో జరిగిన ‘ఫర్ ఎవర్ మిస్ ఇండియా’ పోటీల్లో ఆమె ప్రతిభ చూపింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం బీచ్‌రోడ్డులోని నొవొటెల్ హోటల్‌లో ఆమెకు రాజ్ మతాజ్ సంస్థ ప్రతినిధి మీనాక్షి అనంతరామ్ కిరీటం బహూకరించారు. త్వరలో జైపూర్‌లో జరిగే ‘ఫర్ ఎవర్ మిస్ ఇండియా’ ఫైనల్ పోటీల్లో ఆమె రాష్ట్రం తరఫున పాల్గొంటారని తెలిపారు. వైద్యవిద్యార్థినిగా కొనసాగుతూ ఫ్యాషన్ రంగంపై మక్కువతో ఈ విజయాన్ని సాధించడం అభినందనీయమని కొనియాడారు. నిర్వాహకులు డాక్టర్ సి.రాఘవ, డాక్టర్ యార్లగడ్డ గీత, డాక్టర్ బి.కె.అగర్వాల్, రైస్ కంపెనీ అధినేత కరణం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ