రుషికొండ.బీచ్.లో. సముద్రస్నానాలు చేస్తుండగా మునిగిపోతున్న ఏడుగురిని కాపాడిన.లైఫ్.గార్డ్ లు
అమరావతి, 1 సెప్టెంబర్ (హి.స.) సాగర్‌నగర్, రుషికొండ బీచ్‌లో ఆదివారం సముద్ర స్నానాలు చేస్తుండగా మునిగిపోబోతున్న ఏడుగురు యువతి, యువకుల్ని టూరిజం బ్లూఫ్లాగ్‌ బీచ్, జీవీఎంసీ లైఫ్‌ గార్డులు రక్షించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చంద్రకర్‌ (24), అంజు బాగల్
రుషికొండ.బీచ్.లో. సముద్రస్నానాలు చేస్తుండగా మునిగిపోతున్న ఏడుగురిని కాపాడిన.లైఫ్.గార్డ్ లు


అమరావతి, 1 సెప్టెంబర్ (హి.స.)

సాగర్‌నగర్, రుషికొండ బీచ్‌లో ఆదివారం సముద్ర స్నానాలు చేస్తుండగా మునిగిపోబోతున్న ఏడుగురు యువతి, యువకుల్ని టూరిజం బ్లూఫ్లాగ్‌ బీచ్, జీవీఎంసీ లైఫ్‌ గార్డులు రక్షించారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చంద్రకర్‌ (24), అంజు బాగల్‌ (26), కుష్బోయాదవ్‌ (33), గౌరవ్‌ సాహు (24), అర్షి సింగ (23), రోహన్‌ చంద్రకర్‌ (23) మొత్తం ఆరుగురు విహార యాత్రలో భాగంగా తీరానికి వచ్చారు. ఈ క్రమంలో వీరు స్నానాలు చేస్తుండగా అలల్లో చిక్కుకున్న విషయాన్ని గమనించిన గార్డులు సకాలంలో ఒడ్డుకు చేర్చి ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. అలాగే కెరటాల్లో చిక్కుకున్న నగరంలోని అల్లిపురం ప్రాంతానికి డి.సాయి(22)ను రక్షించారు. మెరైన్‌ పోలీసుల సమక్షంలో వీరికి కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించేశారు. ఏడుగురి ప్రాణాలను కాపాడిన గార్డుల్ని పర్యాటక, జీవీఎంసీ, పోలీసు అధికారులు అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande