అమరావతి, 1 సెప్టెంబర్ (హి.స.)
జేఎన్‌టీయూ,: మెగా డీఎస్సీలో కొందరు అభ్యర్థులు బోగస్ దివ్యాంగ సర్టిఫికెట్లు సమర్పించినట్లు సమాచారం. 24 మంది దివ్యాంగ ధ్రువపత్రాలు సమర్పించగా.. ఆరుగురికి చెవుడు ఉన్నట్లు సమర్పించారు. వారి సర్టిఫికెట్ల పునఃపరిశీలనకు కర్నూలు సర్వజన ఆసుపత్రికి పంపించారు. మిగిలిన 18 మంది దివ్యాంగులను అనంతపురం సర్వజన ఆసుపత్రిలో పరిశీలించారు. కొందరు అభ్యర్థులు 90 శాతం వికలత్వం ఉన్నట్లు సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేశారు. కానీ ఆ అభ్యర్థులకు తక్కువ శాతం వికలత్వం ఉన్నట్లు ధ్రువీకరించి, విద్యాశాఖకు నివేదిక ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో 807 ఉపాధ్యాయ పోస్టులు మెగా డీఎస్సీ-2025లో భర్తీ చేస్తున్నారు. 35 వేల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు. మెరిట్ జాబితా ప్రకారం ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 28, 29 తేదీల్లో నిర్వహించారు. 757 మంది అభ్యర్థులకు ధ్రువపత్రాలు పరిశీలించారు. మరో 50 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన రెండో విడతలో చేపట్టనున్నారు. తొలివిడత పరిశీలనలో బోగస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ