బాపట్ల, 31 ఆగస్టు (హి.స.) ఏపీలోని బాపట్లలో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. సముద్రం ఒడ్డుకు అరుదైన శ్రీకృష్ణుడి విగ్రహం కొట్టుకువచ్చింది. బాపట్లలోని చిన్నగంజాం మండలం మోటుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అలల తాకిడికి తీరప్రాంతానికి శంకు చక్రాలతో కూడి కృష్ణుడి విగ్రహం కొట్టుకురావడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. విగ్రహాన్ని చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు, భక్తులు తరలివస్తున్నారు. విషయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో వారు కూడా చూసేందుకు అక్కడకు చేరుకుంటున్నారు. ఇక విగ్రహం చూసేందుకు ఎంతో చక్కగా కృష్ణుడు నిలుచుని కనిపిస్తున్నాడు. చూస్తుంటే చాలా ఏళ్ల నాటి విగ్రహంలా కనిపిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి