నేడు రేపు ఏపి వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.) అమరావతి: నేడు, రేపు ఏపీలో వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నష్టం అంచనా వేస్తున్నారు. రెండు బృందాలుగా జిల్లాలకు.. దీంతో ఈ రోజుకు గృహ నష్టం అంచనా పూర్తి కావాలనీ కల
నేడు రేపు ఏపి వరద ప్రాంతాల్లో  కేంద్ర బృందం పర్యటన


అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)

అమరావతి: నేడు, రేపు ఏపీలో వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నష్టం అంచనా వేస్తున్నారు. రెండు బృందాలుగా జిల్లాలకు.. దీంతో ఈ రోజుకు గృహ నష్టం అంచనా పూర్తి కావాలనీ కలెక్టర్లకు ఆర్‌పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్‌ జిల్లాల పరిధిలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్‌ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఏపీలో పర్యటించనుంది. రెండు టీమ్‌లుగా విడిపోయి కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande