వాషింగ్టన్:, 11 సెప్టెంబర్ (హి.స.) ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. భాజపా విధానాలను దుయ్యబట్టారు. గత పదేళ్లలో భారత్‌లో ప్రజాస్వామ్యంవిచ్ఛిన్నమైందని, కానీ ప్రస్తుతం నిలదొక్కుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రజాస్వామ్య ) మనుగడ కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. దానిని పడగొడుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మా నుంచి దూరం చేశారు. అదంతా నా కళ్ల ముందే జరిగింది. మా శాసనసభ్యులు అనూహ్యంగా భాజపా సభ్యులయ్యారు. దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది. బలహీనంగా మారిపోయింది. ఇప్పుడు దానిని నిలబెట్టేందుకు పోరాటం జరుగుతోంది’’ అని రాహుల్ అన్నారు. ఎన్నికల ఫలితాలు చూస్తే.. భారత ప్రజాస్వామ్యంపై మరింత ఆశ కలుగుతోందన్నారు.
‘‘మేం ఎన్నికల్లో పోటీ చేసేముందు మా పార్టీ బ్యాంకు ఖాతాలన్నీ స్తంభించాయి. ఏదైనా ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరిగి ఉంటుందో, లేదో నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితులు సిరియా, ఇరాక్‌లలో ఉండొచ్చు. ఎన్నికల ముందు మా కోశాధికారిని అడిగితే డబ్బు లేదన్నారు. కానీ మా ముందు ఓటరు ఉన్నాడు. అతడితోనే మేం మాట్లాడాం. నాపై దాదాపు 20 కేసులు పెట్టారు. భారతదేశ చరిత్రలో పరువునష్టం కేసులో జైలు శిక్షను ఎదుర్కొన్న ఏకైక వ్యక్తిని నేనే. మా ముఖ్యమంత్రి ఒకరు ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. కానీ మాకు భారతీయ ఓటరు ఉన్నాడు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు