ట్రంప్‌, కమలాహారిస్‌ మధ్య చర్చ పరస్పరం విమర్శలతో
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.): అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చ వాడీవేడిగా సాగింది. ఇద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్‌పై రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇది అత్యుత్తమ చర్చ అని ట్రంప్‌ పేర్కొన్నారు. మరోవై
ట్రంప్‌, కమలాహారిస్‌ మధ్య చర్చ పరస్పరం విమర్శలతో


హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.): అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య చర్చ వాడీవేడిగా సాగింది. ఇద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్‌పై రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇది అత్యుత్తమ చర్చ అని ట్రంప్‌ పేర్కొన్నారు. మరోవైపు ఇదే సమయంలో ఏబీసీ నెట్‌వర్క్‌పై మాజీ అధ్యక్షుడు మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఈ డిబేట్‌పై ట్రంప్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘‘ఎప్పటికీ ఇది అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా నేను భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

ఇరువురి షేక్‌హ్యాండ్‌తో ప్రారంభమైన ఈ చర్చ.. అనంతరం పరస్పర విమర్శల దాడితో కొనసాగింది. కమలాహారిస్‌ బైడెన్‌ను వ్యతిరేకిస్తారని.. ఆయన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారని ట్రంప్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి అంతే దీటుగా బదులిచ్చారు కమల. ‘‘నేను జో బైడెన్‌ను కాదు. ట్రంప్‌నూ కాదు. నేను మన దేశానికి కొత్తతరం నాయకత్వాన్ని అందిస్తున్నాను’’ అంటూ సమాధానమిచ్చారు. ఇక జోబైడెన్‌పై ట్రంప్‌ తీవ్ర విమర్శలు గుప్పించడంతో.. ‘‘మొదట మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు నాపై పోటీ చేస్తున్నారు.. జోబైడెన్‌పై కాదు’’ అంటూ మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande