ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల్లో సామాన్య.భక్తులకు ప్రాధాన్యం
అమరావతి, 19 సెప్టెంబర్ (హి.స.) ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రోత్సవాల్లో సామాన్య భక్తుల దర్శనానికే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ జి.సృజన వెల్లడించారు. అక్టోబరు 3 నుంచి 12 వరకు దుర్గగుడిలో దసరా ఉత్సవాలు జరగనున్నాయి. తొమ్మిద
ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల్లో సామాన్య.భక్తులకు ప్రాధాన్యం


అమరావతి, 19 సెప్టెంబర్ (హి.స.)

ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రోత్సవాల్లో సామాన్య భక్తుల దర్శనానికే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ జి.సృజన వెల్లడించారు. అక్టోబరు 3 నుంచి 12 వరకు దుర్గగుడిలో దసరా ఉత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల వేడుకల్లో కనీసం 13లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు.

ప్రతి భక్తుడు సంతృప్తికరంగా అమ్మవారిని దర్శించుకుని వెళ్లేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు, దుర్గగుడి ఈవో కె.ఎస్‌.రామారావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande