వరద బాధితులను అందుకునేందుకు ముందుకు రావాలని.చంద్రబాబు.విజ్ఞప్తి
అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.) అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడు ఊపందుకు
వరద బాధితులను అందుకునేందుకు ముందుకు రావాలని.చంద్రబాబు.విజ్ఞప్తి


అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)

అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు ఇప్పుడిప్పుడు ఊపందుకుంటున్నాయి. ఈ కార్యక్రమాలను మరింత ముమ్మరంగా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ప్రకటన చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన విధంగా వారు సీఎం సహాయనిధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande