
నల్గొండ, 22 డిసెంబర్ (హి.స.)
సర్పంచ్, ఉప సర్పంచ్, ఇతర పాలకవర్గ సభ్యులు, అధికారులు సమన్వయంతో సమిష్టిగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా ఉరుమడ్ల గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తన సొంత గ్రామమైన ఉరుమడ్ల గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పాలకవర్గం పనిచేయాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు