
యాదాద్రి భువనగిరి, 22 డిసెంబర్ (హి.స.)
ఎన్నికల సమయంలో మాత్రమే
పార్టీలు ఉంటాయని, ఎన్నికలు ముగిశాక నూతనంగా గెలిచిన సర్పంచులు ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి దిశగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సూచించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని చెల్లూరు కాలువ సర్పంచు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే విధంగా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు