ప్రమాణస్వీకారోత్సవానికి సర్పంచ్ గైర్హాజరు.. ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన..
ఆసిఫాబాద్, 22 డిసెంబర్ (హి.స.) ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి సర్పంచ్ ప్రమాణస్వీకారంలో వింత పోకడ చోటుచేసుకుంది. సర్పంచ్ సహా ఏడుగురు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. దీంతో హాజరైన ఉప సర్పంచ్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులతోనే అధికారులు ప్
సర్పంచ్ గైర్హాజరు


ఆసిఫాబాద్, 22 డిసెంబర్ (హి.స.) ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి సర్పంచ్ ప్రమాణస్వీకారంలో వింత పోకడ చోటుచేసుకుంది. సర్పంచ్ సహా ఏడుగురు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. దీంతో హాజరైన ఉప సర్పంచ్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులతోనే అధికారులు ప్రమాణస్వీకారం నిర్వహించారు. వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో 14 వార్డులు ఉండగా ఉప సర్పంచ్ తో పాటు ఆరుగురు వార్డు సభ్యులు మాత్రమే ప్రమాణ స్వీకారానికి హాజరు కావడంతో స్థానిక ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా సర్పంచ్ పాలకవర్గ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు ఉండడం వల్లే ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande