అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)
వన్‌టౌన్, సింహాచలం, సాగర్‌నగర్, కంచరపాలెం, విజయవాడ వరద బాధితులకు విశాఖ జిల్లా యంత్రాంగం బాసటగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వాయువేగంగా నాలుగు విడతల్లో 1.96లక్షల ఆహార పొట్లాలను రైళ్లలో తరలించింది. కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా సరఫరా అధికారి జి.సూర్యప్రకాశరావు, ఏఎస్‌ఓలు, చెకింగ్ ఇన్‌స్పెక్టర్లు, మహారాణిపేట ఇన్‌ఛార్జి తహసీల్దార్ చేతన్‌కుమార్ తదితరుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి 55వేలు, మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు మూడు విడతల్లో 65వేలు, 38వేలు, 38వేలు వెరసి మొత్తంగా 1.96లక్షల ఆహార పొట్లాలు పంపారు. వాటిల్లో టమోటా బాత్, పెరుగన్నం, సాంబార్ అన్నం, పులిహోరా, వెజిటెబుల్ బిరియాని ఉన్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి చెప్పారు. అక్షయపాత్ర, గీతం విశ్వవిద్యాలయం, ఎస్‌కేఎంఎల్ కేటరింగ్, సాయిరామ్ పార్లర్, కనకమహాలక్ష్మి, సింహాచలం ఆలయ ప్రాంగణాల్లో ఆహారం తయారు చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం నుంచి ఆహార పొట్లాల సరఫరాను నిలిపివేశారు. వాటిస్థానంలో 20వేల నీటి సీసాలు సేకరించి రాత్రి రైలులో పంపుతున్నారు. పాలప్యాకెట్లు పంపడానికి చర్యలు తీసుకుంటున్నారు. బీ సింహాచలం ఆలయంలో సుమారు 700 కిలోల బియ్యంతో పులిహోర తయారు చేసినట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. కార్యక్రమంలో ఈఈ రాంబాబు, డీఈఈ హరి, ఏఈ గోవర్ధన్, ఏఈవో పిళ్లా శ్రీనివాసరావు, పర్యవేక్షకుడు పాలూరి నరసింగరావు, సిబ్బంది పాల్గొన్నారు. బీ విజయవాడ ప్రాంత ప్రజలకు, ప్రభుత్వానికి అండగా
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల