అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.) వరద బీభత్సం నుంచి బెజవాడ () వాసులు ఇంకా కోలుకోని స్థితిలో ఉన్నారు. గత నాలుగు రోజులుగా వరద నీటిలోనే వరద బాధితులు జీవనం గడుపుతున్నారు. దాదాపు 15 డివిజన్ ప్రజలు వరద నీటిలోనే ఉన్నారు. వరద ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో వేలాది మంది బాధితులు కాలనీలను వదలి బయటకు వెళ్తున్నారు. ఇంకా కాలనీ లోపలకు సహాయం అందని పరిస్థితి.
కేవలం మెయిన్ రోడ్డు వరకే ఉన్నతాధికారులు పరిమితం అవుతున్నారని బాధితులు చెబుతున్నారు. వరద తగ్గు మొహం పట్టినప్పటికీ అధికారులు సరిగ్గా స్పందించడం లేదని వరద బాధితులు వాపోతున్నారు. అలాగే సందర్శకులను అదుపు చేయడంలోనూ పోలీసులు వైఫల్యం చెందారు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద తగ్గడంతో లంక గ్రామాలు తేరుకుంటున్నాయి. వరద నీటిలో రోడ్లు కనపబడని పరిస్థితి ఏర్పడగా.. ఇప్పుడు కాస్త వరద తగ్గుముఖం పట్టడంతో రహదారులు బయటడుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల