ఆఫ్రికా దేశం కెన్యాలో ప్రైమరీ స్కూల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది చిన్నారుల మృతి
న్యూఢిల్లీ, 6 సెప్టెంబర్ (హి.స.) ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కెన్యాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది పిల్లలు దుర్మరణం చెందారు. సెంట్రల్ కెన్యా నైరీ కౌంటీలోని ప్రైమరీ స్కూల్ డార్మిటరీలో మంటలు చెలరేగాయి. దీంతో 5-12 ఏళ్ల మధ్య వ
కెన్యా అగ్నిప్రమాదం


న్యూఢిల్లీ, 6 సెప్టెంబర్ (హి.స.)

ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోర అగ్ని

ప్రమాదం జరిగింది. కెన్యాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది పిల్లలు దుర్మరణం చెందారు. సెంట్రల్ కెన్యా

నైరీ కౌంటీలోని ప్రైమరీ స్కూల్ డార్మిటరీలో మంటలు చెలరేగాయి. దీంతో 5-12 ఏళ్ల మధ్య వయసున్న 17

మంది విద్యార్థులు నిద్రలోనే సజీవ దహనమయ్యారు.మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా

గాయపడిన మరో 13 మందిని ఆసుపత్రికి తరలించారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అగ్నిప్రమాదానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు

తీసుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు విలియం రూటో హామీ ఇచ్చారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande