విశాఖ స్టీల్ ప్లాంట్ .ను కేంద్రం  శుభవార్త చెప్పింది
విజయవాడ, 17 జనవరి (హి.స.) విశాఖపట్నం,: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ప్రధాన మంత
 విశాఖ స్టీల్ ప్లాంట్ .ను కేంద్రం  శుభవార్త చెప్పింది


విజయవాడ, 17 జనవరి (హి.స.)

విశాఖపట్నం,: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్‌ కోసం రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ఎక్స్‌ వేదికగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande