హైదరాబాద్, 13 మార్చి (హి.స.) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు.మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి రేపు శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. . ఆయన ఫామ్ హౌస్ లో నిర్వహించిన క్యాసినో, కోళ్ల పందేల కేసులో తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాదాపూర్లోకి పోచారం ఇంటికి వెళ్లిన పోలీసులు.. నోటీసులు అంటించారు. ఈ క్రమంలో రేపు మొయినాబాద్ పోలీసు స్టేషన్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..