హైదరాబాద్, 13 మార్చి (హి.స.) హైదరాబాదులో మరో ప్రాణాన్ని లిఫ్ట్ బలిగొన్నది.
ఆసిఫ్ నగర్ పోలీస్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో ముజ్జాబా అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుని నాలుగేండ్ల చిన్నారి సురేందర్ మరణించాడు. ఆరు అంతస్తులున్న అపార్టుమెంట్ కు సురేందర్ తండ్రి వాచ్మెన్ గా పనిచేస్తుండడం తో అతని కుటుంబం గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ప్రక్కనే చిన్న గదిలో ఉంటున్నది.
ఈ క్రమంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో సురేందర్ ఆడుకుంటూ.. లిఫ్ట్ తలుపు మధ్యకు వెళ్లి అందులో ఇరుక్కుని రక్తపుమడుగులో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడుని సమీపంలో ఉన్న దవాఖానకు తరలించారు. అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..