హైదరాబాద్, 13 మార్చి (హి.స.)
హైదరాబాద్ యూనివర్సిటీ మరోసారి సత్తా చాటింది.. ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచింది.. 2025 ఎడిషన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ సబ్జెక్టుల వారీగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏడు అధ్యయన అంశాలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఎంపికకావడం విశేషంగా చెప్పుకోవాలి.. మార్చి 12వ తేదీన దీనికి సంబంధించిన ర్యాంకింగ్స్ విడుదల చేశారు.. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లోని 1,700 విశ్వవిద్యాలయాల్లో 55 విద్యా విభాగాలకు చెందిన విద్యార్థులు తీసుకున్న 18,300 కంటే ఎక్కువ వ్యక్తిగత విశ్వవిద్యాలయ కార్యక్రమాల పనితీరుపై విశ్లేషణతో ఈ ర్యాంకింగ్స్ ప్రకటించారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..