తెలంగాణ, 21 జనవరి (హి.స.)
తెలంగాణలో రానుంది బీజేపీ ప్రభుత్వమేనని మల్కాజ్గరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలుకు సాధ్యం కానీ హమీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా తులం బంగారం, ప్రతి మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్