మల్లాపూర్ బాబానగర్.లో.నివసిస్తున్న మహిళను హత్య
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)నాచారం: ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమానురాలిని బంగారం కోసం హత్య చేశాడు ఓ క్యాబ్‌ డ్రైవర్‌. నిందితులను సోమవారం నాచారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ ధనుంజయ వివరాల ప్రకారం.. మల్లాపూర్‌ బాబానగర్‌లో సూరెడ్డి సుజాత(65) నివసిస్తున్
మల్లాపూర్ బాబానగర్.లో.నివసిస్తున్న మహిళను హత్య


హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)నాచారం: ఇల్లు అద్దెకు ఇచ్చిన యజమానురాలిని బంగారం కోసం హత్య చేశాడు ఓ క్యాబ్‌ డ్రైవర్‌. నిందితులను సోమవారం నాచారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ ధనుంజయ వివరాల ప్రకారం.. మల్లాపూర్‌ బాబానగర్‌లో సూరెడ్డి సుజాత(65) నివసిస్తున్నారు. భర్త, కుమారులు చనిపోవడంతో ఒంటరి గా ఉంటున్నారు. ఏపీలోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరవలి మండలం కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు(33) డ్రైవర్‌ పని కోసం హైదరాబాద్‌ వచ్చాడు. రెండు నెలల కిందట సుజాత ఇంట్లో అద్దెకు చేరాడు.

ఈ నెల 19న రాత్రి ఆమె హత్య చేసి ఒంటిపై ఉన్న 11 తులాల బంగారాన్ని దోచుకున్నాడు.మృత దేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేశాడు.విషయాన్ని పేరవలి మండలం కందవల్లిలోనిస్నేహితుడు యువరాజు (18), అమలాపురం మండలం వేమవరానికి చెందిన స్నేహితుడు దుర్గారావు (35)కు చెప్పి.. తన సొంతూరుకు వెళ్లాడు. 20న ముగ్గురు కారును అద్దెకు తీసుకుని.. మల్లాపూర్‌ చేరుకున్నారు. మృతదేహాన్ని కారులో కోనసీమ జిల్లా కృష్ణలంకకు తరలించి గోదావరిలో విసిరేశారు. మొయినా బాద్‌లో ఉంటున్న సుజాత చెల్లెలు సువర్ణలత 24న సోదరి ఇంటికి రాగా.. ఆమె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అద్దెకు ఉంటున్న అంజిబాబు కనిపిం చకపోవడంతో పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande