తెలంగాణ, 22 జనవరి (హి.స.)
జనపనార రైతులకు కేంద్ర
ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2025-26 సీజన్ కు సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ముడి జూట్ ఎంఎస్పీ మునుపటి మార్కెటింగ్ సీజన్ 2024-25 కంటే క్వింటాల్కు రూ.315 పెంచింది. 2025-26 సీజన్ లో ముడి జనపరాన (టీడీ- 3గ్రేడ్) ముడి జనపరాన కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. రూ.5650గా నిర్ణయించింది. ఈ నిర్ణయం రైతులకు 66.8 శాతం రాబడిని ఇస్తుందని కేంద్రం పేర్కొంది. 2014-15 నుండి 2024-25 మధ్య కాలంలో జనపనార సాగు చేసే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం రూ. 1300 కోట్లు కాగా 2004-05 నుండి 2013-14 మధ్యకాలంలో చెల్లించిన మొత్తం రూ. 441 కోట్లు. 40 లక్షల వ్యవసాయ కుటుంబాల జీవనోపాధి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జూట్ పరిశ్రమపై ఆధారపడి ఉంది. దాదాపు 4 లక్షల మంది కార్మికులు జూట్ మిల్లుల్లో ప్రత్యక్ష ఉపాధిని పొందుతున్నారు. అలాగే జూట్ వ్యాపారం చేస్తున్నారు. గతేడాది లక్షా 70 వేల మంది రైతుల నుంచి జనపనారను కొనుగోలు చేశారు. జనపనార రైతులలో 82% పశ్చిమ బెంగాల్కు చెందినవారు కాగా మిగిలిన అస్సాం మరియు బీహార్లు జూట్ ఉత్పత్తిలో 9% వాటా కలిగి ఉన్నారు. జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జేసీఐ) ప్రైస్ సపోర్టు కార్యకలాపాలను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా కొనసాగుతుంది. అయితే ఈ కార్యకలాపాలలో ఏవైనా నష్టాలు ఉంటే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రీయింబర్స్ చేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్