తెలంగాణ, 22 జనవరి (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలకు బ్రేక్ పడింది. భారీ లాభాలతో సూచీలు ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ బుధవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా గ్రీన్ కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 566 పాయింట్లు లాభపడి 76, 404 దగ్గర ముగియగా.. నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 23, 155 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే 25 పైసలు పెరిగి రూ.86.33 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా అత్యధికంగా లాభపడగా.. భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా మోటార్స్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ నష్టపోయాయి. మిడ్క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1.5 శాతం తగ్గాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్