ఫుట్ పాత్ వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తాను.. సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ, 22 జనవరి (హి.స.) ఫుట్ పాత్ వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్ట్రీట్ వెండర్
తలసాని శ్రీనివాస్ యాదవ్


తెలంగాణ, 22 జనవరి (హి.స.)

ఫుట్ పాత్ వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్ట్రీట్ వెండర్స్లో అధికంగా పేదలు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు మానవతాదృక్పధంతో వ్యవహరించాలన్నారు. 23 వ తేదీన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని తెలిపారు. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande