తెలంగాణ, 22 జనవరి (హి.స.)
గత సంవత్సర కాలంగా కాంగ్రెస్
ప్రభుత్వ పనితీరును దగ్గర నుంచి గమనిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. నిన్న, ఇవాల్టి గ్రామసభలను చూస్తే కాంగ్రెస్ ప్రజాపాలన తీరు ఏమిటో తెలిసిపోతోందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో సత్తుపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ సభల్లో ప్రభుత్వాన్ని గ్యారంటీలపై నిలదీస్తున్నారని కేటీఆర్ తెలిపారు. గ్రామ సభలకు వేసిన టెంట్లను కూడా ప్రజలు కోపంతో పీకేస్తున్నారు. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఓడిపోవడంతో ఆ నియోజకవర్గ ప్రజలు ప్రజలు ఎంతో కోల్పోయారు. గ్రామాలు, పట్టణాల్లో కేసీఆర్ హాయంలో జరిగినన్నీ పనులు గతంలో ఎప్పుడూ జరగలేదు. మున్సిపాలిటీకి రూ. 50 లక్షలు కేటాయిస్తే గొప్ప అనుకునే పరిస్థితి ఉండేది.. కేసీఆర్ హయంలో ఆ పరిస్థితి మారి పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్