విశాఖపట్నం, 12 అక్టోబర్ (హి.స.)
విశాఖకు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ తరలివచ్చింది. దేశ కృత్రిమ మేధ సాధికారత దిశగా విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్‌లోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ( ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌తోపాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.
అంతకుముందు మధురవాడ ఐటీ పార్క్‌కు చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు మంగళ వాయిద్యాలతో నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తోపాటు, రుషికొండలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు ఆయన శంకుస్థాపన చేసి.. శిలాఫలకాలను ఆవిష్కరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ