body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,,14, అక్టోబర్ (హి.స.)హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లుకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెక్ కంపెనీల్లో గందరగోళానికి దారితీసింది. ఈ భారీ మొత్తం ఫీజుతో సంస్థలపై అదనపు భారం పడనుంది. ఈ పరిణామాల వేళ టీసీఎస్ (TCS) సీఈఓ కె.కృతివాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది హెచ్-1బీ (H-1B Visa) కింద కొత్త నియామకాలు చేపట్టబోమని తెలిపారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పందించారు.
‘‘అమెరికా (USA)లో మాకు సరిపడా హెచ్-1బీ ఉద్యోగులు ఉన్నారు. అగ్రరాజ్యంలో మా కంపెనీలో 32,000-33,000 సిబ్బంది ఉండగా.. ఇందులో దాదాపు 11వేల మంది హెచ్-1బీ పైన వచ్చినవారే. ఈ ఏడాది ఇప్పటికే 500 మందిని ఈ వీసాలతో భారత్ నుంచి అమెరికాకు పంపించాం. అయితే, ప్రస్తుత ఏడాదిలో హెచ్-1బీ కింద కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రణాళిక లేదు. స్థానిక ఉద్యోగుల (అమెరికన్లను ఉద్దేశిస్తూ) నియామకాలే కొనసాగిస్తాం. హెచ్-1బీ వీసా ఉద్యోగులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాలనుకుంటున్నాం. ఎల్-1 వీసాల సదుపాయం కూడా ఉంది. అయితే, అవి పూర్తిగా హెచ్-1బీని భర్తీ చేయలేవు’’ అని కృతివాసన్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ