body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
చెన్నై,14, అక్టోబర్ (హి.స.) బాణసంచాలకు ఉపయోగించే పేలుడు పదార్థాల పరిశ్రమలు, విక్రయ దారుల నుంచి రూ. 2 కోట్లు లంచం పుచ్చుకున్న ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరిని సీబీఐ, అవినీతి నిరోధక విభాగం అధికారులు పథకం ప్రకారం సేలంలో అరెస్టు చేశారు. ఆయన్ని విచారిస్తున్నారు. వివరాలు..
పేలుడు పదార్థాలకు అనుమతి వ్యవహారానికి సంబంధించిన విభాగంలో గణేష్ కీలక అధికారిగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఆయన గత రెండు రోజులుగా సేలంలోని ఓ హోటల్‌లో బస చేసి ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన బయటకు వెళ్లి రావడం జరుగుతూ వచ్చింది. ఈ వ్యవహారం సీబీఐ, అవినీతి నిరోధక విభాగం అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆదివారం అర్థరాత్రి వేళ ఆయన బస చేసిన హోటల్ గదిలో సోదాలు చేశారు. ఇక్కడ రూ. 2 కోట్లు పట్టుబడట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ఆయన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా దీపావళి మాముళ్ల వేటలో భాగంగా ఇక్కడి పరిశ్రమలు, విక్రయదారులను ఆయనకలుస్తూ వచ్చినట్టు, వారి నుంచి లంచంగా ఈ మొత్తం పుచ్చుకున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, చెక్‌పోస్టులు పరిసరాలలో ఏసీబీ రంగంలోకి దిగింది. దీపావళి మాముళ్ల వేట సాగే అవకాశాలతో ని«ఘాతో వ్యవహరిస్తున్నారు. ఈ దృష్ట్యా, ఈసారి అవినీతి నిరోధక శాఖకు ఏఏ అధికారి చిక్కబోతున్నాడో వేచిచూడాల్సిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వ అధికారి చిక్కడం చర్చకు దారి తీసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ