జీమెయిల్‌ నుంచి జోహోమెయిల్‌
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-fa
జీమెయిల్‌ నుంచి జోహోమెయిల్‌


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ,,14, అక్టోబర్ (హి.స.)దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో.. కేంద్రమంత్రి అమిత్‌ షా జీమెయిల్‌ నుంచి జోహో మెయిల్‌కి మారారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు దేశీయంగా అభివృద్ధి చేసిన జోహోకు సేవలకు మారుతున్నట్లు తెలిపారు. దీంతో కంపెనీ పేరు మారుమోగుతోంది. జోహో వినియోగదారుల గోప్యతను కాపాడుతూ, ప్రకటనలు లేకుండా (Ad-free) సేవలను అందిస్తుంది. వ్యాపారులు, నిపుణులు ఎక్కువగా ఉపయోగించే ఈ ప్లాట్‌ఫాం కస్టమ్‌ డొమైన్ ఇమెయిల్స్‌, సులభమైన ఇంటర్‌ఫేస్‌, గోప్యతా రక్షణలు వంటి సదుపాయాలతో ఆకట్టుకుంటోంది. తక్కువ ఖర్చుతో ప్రొఫెషనల్‌ స్థాయి టూల్స్‌ అందిస్తుంది. వ్యక్తిగత లేదా వ్యాపార డొమైన్‌ పేరుతో ప్రత్యేకమైన ఇమెయిల్‌ అడ్రెస్‌ సృష్టించుకునే సదుపాయం ఉంది. అంతేకాకుండా, డిస్ట్రాక్షన్‌-ఫ్రీ ఇన్‌బాక్స్‌ అనుభవం కల్పిస్తుంది. జీమెయిల్‌ నుంచి జోహో మెయిల్‌కి మారడం చాలా సులభం. మీ మెయిల్స్‌, కాంటాక్ట్స్‌ ఏవీ కోల్పోకుండా మారొచ్చు. అదెలాగో చూద్దాం..

గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్‌స్టోర్‌ నుంచి జోహో మెయిల్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయండి. లేదంటే జోహోమెయిల్ వెబ్‌సైట్‌లో కూడా ఖాతా సృష్టించవచ్చు.

ఇప్పుడు మీ వ్యాపారం కోసం అయితే బిజినెస్‌ ఇమెయిల్‌, వ్యక్తిగతంగా అయితే పర్సనల్‌ ఇమెయిల్‌పై క్లిక్‌ చేయండి.

మీ జీమెయిల్‌ ఖాతాలోకి వెళ్లి Settings> See all settings> Forwarding and POP/IMAP క్లిక్‌ చేయండి.

తర్వాత IMAP ను ఎనేబుల్‌ చేయండి. దీని ద్వారా జోహో మెయిల్‌ మీ జీమెయిల్‌ డేటాను యాక్సెస్‌ చేసి ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది.

జోహో మెయిల్‌లో Settings> Import/Export ఎంపికను ఓపెన్‌ చేయండి.

అక్కడ Migration Wizard ద్వారా జీమెయిల్‌ నుంచి మీ ఇమెయిల్స్‌, ఫోల్డర్లు, కాంటాక్ట్స్‌ అన్నీ ఇంపోర్ట్‌ చేయొచ్చు.

కొత్తగా వచ్చే మెయిల్స్‌ కూడా జోహో ఖాతాకి రావాలంటే, జీమెయిల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Email forwarding ఎంపికలో మీ కొత్త Zoho Mail చిరునామాను నమోదు చేయండి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande