body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ,/విశాఖపట్నం,,14, అక్టోబర్ (హి.స.)విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గూగుల్ మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)తో ఫోన్‌లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి ఏఐ హబ్ (Google AI Hub in Vizag) విశేషాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ విషయాన్ని సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) తన ‘ఎక్స్’ పోస్ట్‌లో వెల్లడించారు.
‘‘విశాఖపట్నంలో గూగుల్ (Google) తొలి ఏఐ హబ్‌కు సంబంధించిన ప్రణాళికలను పంచుకునేందుకు ప్రధాని మోదీతో మాట్లాడా. ఈ ఏఐ హబ్ ఓ కీలక మైలురాయిగా నిలువనుంది. ఈ హబ్‌లో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీ స్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఉండనున్నాయి. ఈ హబ్‌తో అధునాతన సాంకేతికతను భారత్‌లో సంస్థలు, వినియోగదారులకు అందించనున్నాం. కృత్రిమ మేధ ఆవిష్కరణలను మరింత వేగవంతం చేస్తాం’’ అని సుందర్ పిచాయ్ (Sundar Pichai) రాసుకొచ్చారు.
దిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం, గూగుల్ మధ్య మంగళవారం ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ రానున్న ఐదేళ్లలో సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. భారత్‌లో ఈ కంపెనీకి ఇదే అతిపెద్ద పెట్టుబడి. ఈ ఒప్పందం సందర్భంగా గూగుల్ (Google) క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్ మాట్లాడుతూ.. గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ మారనుందని తెలిపారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్‌సీ-కేబుల్ విధానం అనుసంధానం చేస్తామని చెప్పారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ