హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్వంలో శనివారం తెలంగాణ బంద్ (BC Bandh) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ నల్లకుంట, కాచిగూడ పరిధిలో పలువురు షాపులు, షోరూమ్లు, పెట్రోల్ బంక్లపై దాడులకు పాల్పడ్డారు. దీంతో వారిపై ఆయా పోలీస్ స్టేషన్లో ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా దాడులకు పాల్పడిన 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్కు తరలించారు.
శనివారం నిర్వహించిన బీసీ బందు సందర్భంగా విద్యానగర్ నుంచి బర్కత్పురా వరకు బీసీ జేఏసీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దుకాణాలు, షోరూమ్లు, పెట్రోల్ బంకులపై దాడులకు పాల్పడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు