
ఢిల్లీ,23, అక్టోబర్ (హి.స.) బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు కీలక హామీలతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాల సభ్యు(జీవిక దీదీ)లకు ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు.
‘‘ రాష్ట్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కారి్మకులందరి ఉద్యోగాలను పరి్మనెంట్ చేస్తాం. జీవిక దీదీలుసహా మొత్తం 2,00,000 మంది కమ్యూనిటీ మొబిలైజర్‌ల ఉద్యోగాలను క్రమబదీ్ధకరిస్తా. కమ్యూనిటీ మొబిలైజర్‌లకు రూ.30,000 గౌరవ వేతనం అందిస్తా’’ అని తేజస్వీ ప్రకటించారు. ప్రపంచబ్యాంక్ ఆర్థికసాయంతో బిహార్ గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ‘జీవిక’ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ