
ముంబై, 23,అక్టోబర్ (హి.స.) దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నా.. దేశీయంగా మదుపర్ల నుంచి అందుతోన్న మద్దతుతో సూచీలు రాణిస్తున్నాయి. అమెరికా డాలర్ బలోపేతం కావడం వంటి పరిణామాలు దోహదం చేస్తున్నాయి.
ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 750 పాయింట్ల లాభంతో 85,186 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 210 పాయింట్లు పుంజుకొని 26వేల మార్క్ దాటేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.83గా ఉంది. నిఫ్టీ సూచీలో టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కొటక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ